Ganesha Worship According to the Vedas - A short explanation by Pandit Anil Sharma in Telugu

ఓం శ్రీ మహాగణపతయే నమః

 

ఓం గణానాం త్వా గణపతిగ్‌ం హవమహే |

కవిం కవీనా ముపమశ్రవస్తమం           |

జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం  బ్రహ్మణస్పత     |

ఆనశ్శృణ్వన్నూతిభిస్సీద  సాదనం       ||

 

సమస్త గణములకు అధిపతియైన ఆ గణపతిని పండితులలో కెల్ల మహా పండితుడు గా విరాజిల్లు , సకలమైన రాజులకు జ్యెష్ఠుడగు,  బ్రహ్మఙ్ఞులకు బ్రహ్మఙ్ఞుడైన  ఆ గణనాయకుని ,  పిలిచినదే తడవుగా ఏతెంచి  అన్ని కష్టములను నివారించు స్వభావ చిత్తుడని  వేదమంత్రములు గణపతిని కొనియాడి యున్నవి .

అట్టి గణపతిని పూజించు  వారలు ,ధ్యానించు  వారలు ,అర్చించు వారలు , తమ సమస్త అభీష్టములను  పొందగలరు అని వేద వాక్యము .

 

భాద్రపద  శుక్ల  చవితి (వినయకచవితి ) నాడు  ప్రాతః కాలము యందు నద్ర లేచి , వాకిలి చక్కగా ఆవు పేడతో అలికి, ఐదు రంగులచేత ముగ్గు వేసి , ఇంటి గుమ్మమును మామిడి తోరణములచె అలంకరించి, తెల్ల నువ్వులతో  స్నానం చేసి, నిత్య కర్మను చక్కగా పూర్తిచేసినవారై;

మధ్యాహ్న కాలము  యందు  బంగారముతో గానీ ,    వెండితో గానీ,     మట్టి తో గానీ    విఘ్నేశ్వరుని ప్రతిమను చేయించి   గంధ పుష్పాక్షత, ధూప దీప  నైవేద్యములతోను , మరువము,మామిడి,జామ,పున్నాగ,జిళ్లేడు మొదలగు ఇరువదియొక్క రకముల పత్రి చేతను; జాజి ,చంపక మొదలగు ఇరువదియొక్క రకముల పుష్పముల చేతను విధిగా అత్యంత భక్తి శ్రధ్ధలతొ విఘ్నేశ్వరుని  పూజించవలెను,

కుడుములు ఉండ్రాళ్లు , వడపప్పు , పానకము పూర్నములు మొదలగు పదార్ధములు గణపతికి నివేదనము చేయవలెను;

పిల్లలు తమ తరగతి పుస్తకములను గణపతి వద్ద ఉంచి పూజించుట ఆచారమై ఉన్నది ,

హారతి గావించిన పిమ్మట వినాయకొత్పత్తియు , చంద్రుని గర్వభంగము మరియూ శ్రీ క్రుష్ణుని శమంతకోపాఖ్యానమను కథలను భక్తితో చదువుకొన వలెను

ఆనాడు చంద్రుని చూడరాదని పార్వతీమాత శాపము

 

ఇట్లు యెవరు వినాయకుని భాద్రపద శుద్ధ చవితి నాడు అనగా వినాయక చవితి నాడు పూజింతురో వారు సంవత్సరమంతయు సుఖ శాంతులతో ఉండెదరని భవిష్యోత్తర  పురాణ  మతము .

 

గణపతి అనూగ్రహ ప్రాప్తిరస్తు ……..